ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణ పనులను ప్రారంభం
SRD: మండల కేంద్రమైన కల్హేర్‌లో ఇందిరమ్మ ఇళ్లకు నిర్మాణ పనులను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తుకారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పేదల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కుమ్మరి సాయవ్వ ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ చేశామని చెప్పారు. ఇందులో రవీందర్, బాలరాజ్ ఉన్నారు.