డ్రగ్స్ పట్టివేత.. పోలీసుల అదుపులో ఇద్దరు మైనర్లు..!
HYD: నగరంలో మరో సారి డ్రగ్స్ కలకలం సృష్టించింది. డగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 60 గ్రాముల MDMA డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ. 6 లక్షల వరకు ఉంటుందని అధికారుల అంచనా వేశారు. పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరు మైనర్లుగా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.