VIDEO: ఊటీని తలపిస్తోన్న మెదక్
మెదక్ జిల్లాను దట్టమైన పొగమంచు కమ్మేసింది. తీవ్రమైన చలి, మంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ వాతావరణం ఊటీని తలపిస్తోంది. ఉదయం 7 గంటలు దాటినా మంచు తగ్గకపోవడంతో ఉద్యోగులు, ప్రజలు బయటకు వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.