కశ్మీరీ వేర్పాటువాదికి జీవితఖైదు
కశ్మీరీ వేర్పాటువాద నాయకురాలు, దుఖ్తరన్-ఇ-మిల్లత్ (DeM) సంస్థ అధ్యక్షురాలు ఆసియా ఆంద్రాబీకి ఢిల్లీలోని ప్రత్యేక NIA కోర్టు జీవితఖైదు విధించింది. జమ్మూకశ్మీర్‌ను భారత్ నుంచి వేరు చేసేందుకు కుట్ర పన్నడం వంటి ఆరోపణలపై ఆమెకు ఈ శిక్ష పడింది. ఆంద్రాబీతో పాటు ఆమె సహచరులు సోఫీ ఫెహమీదా, నహిదా నస్రీన్లకు కూడా కోర్టు 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది.