అక్రమంగా విక్రయిస్తున్న మద్యం పట్టివేత
BDK: ఇల్లందు మండలం కొమరారంలో గొలుసుకట్టు కిరాణ దుకాణంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో, కొమరారం ఎస్సై పఠాన్ నాగుల్ మీరా ఆధ్వర్యంలో శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.5148 విలువైన 26 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. అక్రమ మద్యం వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.