దివ్యాంగులు ముందుకు సాగాలి: హేమభార్గవి

దివ్యాంగులు ముందుకు సాగాలి: హేమభార్గవి

MDK: దివ్యాంగులు ఎన్ని అడ్డంకులు ఉన్నా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని జిల్లా సంక్షేమ అధికారి హేమభార్గవి అన్నారు. మహిళ శిశు దివ్యాంగుల వయోవృద్ధుల, ట్రాన్స్‌జెండర్స్ పర్సన్స్ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవ వేడుకలను మెదక్‌లో నిర్వహించారు. దివ్యాంగులు అన్ని రంగాలలో రాణిస్తూ, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను వారికి అనుగుణంగా మలచుకొని విజయాలు సాధించాలన్నారు.