'ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది'

SRCL: సిరిసిల్ల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. జిల్లాలో 12,623 ఇందిరమ్మ ఇళ్లకు, మహిళా సంఘాలకు చీరల ఆర్డర్లను నేతన్నలకు అప్పగించామని తెలిపారు. రాజన్న ఆలయ అభివృద్ధికి రూ. 213 కోట్లు, వేములవాడ పట్టణ రోడ్ల విస్తరణకు రూ. 47 కోట్లు మంజూరు చేసినట్లు ఆయన చెప్పారు.