రేపు తడ మండలంలో ఎమ్మెల్యే పర్యటన
TPT: సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ సోమవారం తడ మండలంలో పలు ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు ఆమె కార్యాలయం తెలిపింది. 'ఉదయం 11:30 గంటలకు పూడి కుప్పం అంగన్వాడీ కేంద్ర నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 12:30 గంటలకు కారూరు గ్రామంలో రూ.60 లక్షల వ్యయంతో నిర్మించిన డ్రైనేజీ పనులను,అంగన్ వాడి భవనం ప్రారంభిస్తారు.