బీజేపీ మండల ప్రధాన కార్యదర్శిగా తారకృష్ణ
NRPT: ఊట్కూర్ మండల బీజేపీ ప్రధాన కార్యదర్శిగా మంగలి తార కృష్ణను ఎంపిక చేసినట్లు జిల్లా బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను ఇవాళ ప్రత్యేకంగా అభినందించారు. పార్టీ నమ్మకాన్ని నిలబెట్టుకుని మండలంలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తారకృష్ణ అన్నారు. తనకు సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.