జాతీయ స్థాయి 'ఇన్‌స్పైర్' అవార్డుకు లాస్య ఎంపిక..!

జాతీయ స్థాయి 'ఇన్‌స్పైర్' అవార్డుకు లాస్య ఎంపిక..!

JN: రఘునాథపల్లి మండలం అశ్వరావుపల్లి జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థిని బోడ లాస్య జాతీయ స్థాయి ఇన్‌స్పైర్ అవార్డు (2025-26) కు ఎంపికైంది. 9వ తరగతి చదువుతున్న లాస్య ఈ ఘనత సాధించడంపై హెడ్ మాస్టర్ పి.శోభన్ బాబు హర్షం వ్యక్తం చేశారు. గ్రామానికి గర్వకారణమని ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందనలు తెలిపారు.