సర్పంచ్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం
NRML: కడెం మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్ గ్రామంలో గల గురుకుల పాఠశాల ఆవరణలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ బొడ్డు స్పందన ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసర ప్రాంతంలో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శకుంతల, కార్యదర్శి శాంత, ఉపసర్పంచ్ లక్ష్మి, నాయకులు బొడ్డు గంగన్న, వెంకటేష్ ఉన్నారు.