పరీక్షల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
ADB: పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్, ప్రభుత్వ నంబర్-2 పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులకు అవసరమైన కనీస వసతులు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహాసీల్దార్ శ్రీనివాస్, చీఫ్ సూపరింటెండెంట్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.