పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎస్పీ
VZM: 'Eradicating Drugs Through Reading' పోస్టర్‌ను జిల్లా ఎస్పీ దామోదర్ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల ప్రభావాన్ని తగ్గించడంలో పుస్తక పఠనం కీలకమని తెలిపారు. విజయనగరం రీడ్స్ కార్యక్రమాలను అభినందిస్తూ, వ్యవస్థాపకుడు ఈశ్వరరావు రేపల్లి, వారి టీంను ఎస్పీ ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి పోలీసు శాఖ పూర్తి మద్దతు ఉంటుందన్నారు.