ఆటో డ్రైవర్ సర్పంచ్‌గా ఏకగ్రీవం
GDWL: వడ్డేపల్లి మండలం జులేకల్ గ్రామంలో రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో ఆటో డ్రైవర్ రాజు ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నికయ్యారు. ఎస్సీ జనరల్ కేటగిరీలో కేటాయించిన ఈ స్థానాన్ని పోటీ లేకుండా ఏకగ్రీవం చేశారు. 25 ఏళ్లుగా ఆటో నడుపుతూ సౌమ్యంగా ఉంటూ అందరితో మమేకమైన అతడిని ఎన్నుకున్నారు. గ్రామాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని రాజు హామీ ఇచ్చారు.