పది పరీక్షలకు సర్వం సిద్ధం: డీఈవో
SKLM: జిల్లాలో రేపటి నుంచి ఏప్రిల్ 1 వరకు జరగబోయే 10వ తరగతి పరీక్షలు నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈవో ఏ.రవిబాబు తెలిపారు. శనివారం జిల్లాలోని డీఈవో కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. 2026 విద్యా సంవత్సరానికి 28,598 మంది విద్యార్థులు 145 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారని తెలిపారు. ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యం ఉందన్నారు.