VIDEO: బంగారు తిరుచ్చిపై అమ్మవారి దర్శనం
TPT: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారు శుక్రవారం సాయంత్రం బంగారు తిరుచ్చిపై మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. ఈ మేరకు అమ్మవారిని వేకువజామున సుప్రభాతంతో మేలుకొలిపి వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. సాయంత్రం అమ్మవారిని పట్టువస్త్రాలతో శోభాయమానంగా అలంకరించారు. తిరుచ్చిపై కొలువుదీర్చి తిరువీధుల్లో ఊరేగించారు.