గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ
NLG: గిరిజన యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. అగ్రికల్చర్, బ్యూటీ, టూరిజం, అపెరల్ వంటి రంగాల్లో నిపుణుల ద్వారా నైపుణ్యాలు పెంచనున్నారు. ఆసక్తి గల యువతను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనితో యువతకు వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు లభించనున్నాయి అని అధికారులు తెలిపారు.