సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలి:ఎస్పీ

NRPT: రోజు రోజుకు మారుతున్న అధునాతన సాంకేతిక వ్యవస్థపై పోలీసులు అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ యోగేష్ గౌతం అన్నారు. శనివారం నారాయణపేట ఎస్పీ కాన్ఫరెన్స్ హాలులో స్టేషన్ రైటర్స్, టెక్ టీమ్ పోలీసులతో సమావేశం నిర్వహించారు. కొత్తగా వచ్చిన యాప్స్ పై అవగాహన పెంచుకోవాలని సూచించారు. వేసవిలో దొంగతనాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని, నకిలీ విత్తనాలపై నిఘా పెట్టాలన్నారు.