అమల్లోకి వచ్చిన US 50 శాతం సుంకాలు

అమల్లోకి వచ్చిన US 50 శాతం సుంకాలు

భారత్‌పై అమెరికా విధించిన అదనపు 50 శాతం సుంకాలు అమల్లోకి వచ్చాయి. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్‌పై ఒత్తిడి తెచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) తెలిపింది. దీంతో 48 బిలియన్‌ డాలర్ల భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడనుంది. దీనిపై అమెరికా హోంలాండ్‌ భద్రతా విభాగం ఉత్తర్వులు జారీ చేసింది.