VIDEO: పర్మిట్ రూంలో అంగన్వాడీ కేంద్రాల కోడిగుడ్లు పంపిణీ

KNR: హుజురాబాద్‌లోని ఓ వైన్ షాప్ పర్మిట్ రూంలో అంగన్వాడీ కేంద్రాలకు పంపిన కోడిగుడ్లు అమ్మకానికి కనిపించడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. పిల్లలకు అందాల్సిన పోషకాహారం ఇలా దుర్వినియోగం కావడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలు పక్కదారి పడటానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు. ఈ ఘటన పథకాల అమలు తీరుపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతూ, ప్రజల్లో ఆగ్రహం రేకెత్తించింది.