కల్లుగీత కార్మికుల సంక్షేమార్థం జిల్లాలో మద్యం షాపులు

NLR: ప్రభుత్వ ఆదేశాల మేరకు కల్లుగీత కార్మికుల సంక్షేమార్థం జిల్లాలో ప్రత్యేకంగా 5 మద్యం షాపుల కేటాయించినట్టు జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని శంకరం హాల్లో జిల్లాకు మంజూరైన 5 షాపులకు కల్లుగీత కార్మికులలో ఉప కులాలకు మద్యం షాపులను లాటరీ ద్వారా జిల్లా కలెక్టర్ కేటాయించారు.