నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు  విద్యుత్ సరఫరాకు అంతరాయం

కృష్ణా: తోట్లవల్లూరు మండలంలో విద్యుత్ లైన్ మరమ్మతుల కోసం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ దేవదాస్ తెలిపారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. మండలంలోని పెనుమకూరు గ్రామంలో శనివారం ఉదయం 10 గంటలను నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు కరెంటు సరఫరాలో అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమయంలో ప్రజలు సహకరించాలని కోరారు.