రేపు పెరవలి రంగనాథ హుండీ లెక్కింపు

రేపు పెరవలి రంగనాథ హుండీ లెక్కింపు

KRNL: మద్దికేర మండలం పెరవలి గ్రామంలోని శ్రీ రంగనాథ స్వామి హుండీ లెక్కింపు రేపు ఉదయం 10 గంటలకు ఆలయ ప్రాంగణంలో జరుగుతుందని ఆలయ ఈవో రెబ్బ వీరయ్య ఇవాళ తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భక్తుల కానుకలను లెక్కిస్తారన్నారు. గ్రామస్థులు, భక్తులు పాల్గొనవచ్చునని ఆలయ ఛైర్మన్ పారా రవి పేర్కొన్నారు. పాలకులు ఆలయ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు.