రేపు బనగానపల్లెలో పర్యటించనున్న మంత్రి

NDL: రేపు బనగానపల్లె పట్టణంలో రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటిస్తున్నట్లు వ్యక్తిగత కార్యదర్శి మురళీమోహన్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని ఏరియా ఆసుపత్రి ఆవరణలో సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరుకావాలని కోరారు.