ప్రణాళికాబద్ధంగానే పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియ: కలెక్టర్

ప.గో: ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం అవుతున్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టరు, జిల్లా ఎన్నికల అధికారి జె.నివాస్ పేర్కొన్నారు. శనివారం కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి రాయుడిపాలెం ఏపీఎస్పీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిమిత్తం ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్‌ను ఆయన సందర్శించారు.