కూటమి ప్రభుత్వానికి ఆర్యవైశ్యుల కృతజ్ఞతలు

కూటమి ప్రభుత్వానికి ఆర్యవైశ్యుల కృతజ్ఞతలు

KDP: అమరావతిలో పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్‌కు స్థలం కేటాయించడంపై ఆర్యవైశ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బద్వేల్ పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో పూలమాలవేసి నివాళులర్పించారు. ట్రస్టు ఏర్పాటుకు సహకరించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.