విమానాశ్రయంలో భారీ గంజాయి సీజ్

HYD: శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు భారీ గంజాయిని సీజ్ చేశారు. ఈ మేరకు బ్యాంకాక్ నుండి వస్తున్న ప్రయాణికుడి వద్ద 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని గంజాయి అక్రమ రవాణాపై విచారణ జరుపుతున్నారు.