కాంగ్రెస్ చేతులెత్తేసింది: బండి సంజయ్

కాంగ్రెస్ చేతులెత్తేసింది: బండి సంజయ్

TG: సీఎం రేవంత్ వ్యాఖ్యలతో రాష్ట్రం పరువు పోయిందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. 'కుటుంబ పెద్ద చేతులెత్తేస్తే ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ప్రభుత్వం నడపలేని స్థితిలో ఉన్నామంటూ కాంగ్రెస్ చేతులెత్తేసింది. రూ.7 లక్షల కోట్ల అప్పు ఉందని తెలిసే ఎన్నికలకు ముందు హామీలిచ్చి ప్రజలను మోసం చేసింది. హామీలు అమలు చేయలేరని రేవంత్ మాటల్లో స్పష్టమవుతోంది' అని పేర్కొన్నారు.