వాజ్‌పేయికి నివాళులర్పించిన ఎంపీ

వాజ్‌పేయికి నివాళులర్పించిన ఎంపీ

W.G: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి రాజకీయ చాతుర్యంతో దేశంలో అనేక విప్లవాత్మక మార్పులు తెచ్చారని రాజ్యసభ సభ్యుడు పాక సత్యనారాయణ కొనియాడారు. ఆచంటలో వాజ్‌పేయి వర్ధంతి కార్యక్రమం జరిగింది. వాజ్‌పేయి చిత్రపటానికి సత్యనారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాజ్‌‌పేయి అణు పరీక్షలు నిర్వహించి దేశ ప్రతిష్ఠను పెంచారని పేర్కొన్నారు.