సైకిళ్లు పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి
AP: ప్రకాశం జిల్లా అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. కామేపల్లి స్కూల్‌లో విద్యార్థులకు ఆయన సైకిళ్లను అందించారు. ఈ సందర్భంగా కామేపల్లి పాఠశాలకు వాటర్ ప్లాంట్‌ను మంజూరు చేశారు. 37 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను ఇచ్చారు. ఏప్రిల్ 15లోపు నియోజకవర్గంలో 10,450 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేస్తామని తెలిపారు.