మృతులకు పరిహారం ప్రకటన

మృతులకు పరిహారం ప్రకటన

మహారాష్ట్ర నాసిక్ జిల్లాలో కారు అదుపుతప్పి లోయలో పడిన ఘటనలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా మృతులకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.