పేదింటి పెళ్లికి అండగా నిలిచిన గ్రామస్తులు

పేదింటి పెళ్లికి అండగా నిలిచిన గ్రామస్తులు

ఆదిలాబాద్‌ రూరల్‌‌లోని మాలెబోరిగమ గ్రామస్థులు మానవత్వాన్ని చాటుకున్నారు. గ్రామానికి చెందిన మెస్రం రజిత వివాహం నిమిత్తం తమవంతు సాయంగా రూ. 12,500 నగదును సోమవారం రాత్రి కుటుంబ సభ్యులకు అందజేశారు. పేద కుటుంబాలకు ఆర్థిక భారం కాకూడదనే ఉద్దేశంతో గ్రామంలో కట్నకానుకలు, ఆర్భాటాలను నిషేధించినట్లు గ్రామస్తులు తెలిపారు.