పోలీస్ స్టేషన్ ముట్టడించిన జనసేన, టీడీపీ కార్యకర్తలు

పోలీస్ స్టేషన్ ముట్టడించిన జనసేన, టీడీపీ కార్యకర్తలు

తూ.గో: ముమ్మిడివరంలో జనసేన నేత గోదశి పుండరీష్ పై పోలీసులు జులుం చేసారంటూ పోలీసు స్టేషన్ ఎదుట జనసేన, టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆందోళన చేశారు. ఒక భూవివాదంలో మద్యవర్తిగా వచ్చిన పుండరీష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో జనసేన కార్యకర్తలు మండిపడ్డారు. పుండరీష్‌ను వెంటనే విడుదల చెయ్యాలి అంటూ నినాదాలు చేసారు. అనంతరం వారు రోడ్డుపై భైఠాయించారు.