అక్రమ మద్యం తరలింపు.. కేసు నమోదు

అక్రమ మద్యం తరలింపు.. కేసు నమోదు

MNCL: భీమిని మండలంలో అక్రమంగా మద్యం తరలిస్తున్న ఘటన ఆదివారం జరిగింది. ఎస్సై విజయ్ వివరాల మేరకు.. టేకులపల్లి గ్రామానికి చెందిన కొమ్మురాజు, వంశీ అనే ఇద్దరు వ్యక్తులు TS19T6601 నెంబర్ గల ఆటోలో మద్యాన్ని తరలిస్తుండగా పక్కా సమాచారం మేరకు పట్టుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి సుమారు రూ.40 వేల విలువైన మద్యం స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.