ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేసిన మేయర్

KMM: ఖమ్మం కార్పొరేషన్‌కు చెందిన పలువురికి ఆదివారం మంత్రి తుమ్మల క్యాంపు కార్యాలయంలో మేయర్ పునుకొల్లు నీరజ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతి పేద కుటుంబం ఇంటి కలను నిజం చేయాలని సంకల్పించిందన్నారు. అందుకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం, పట్టాల పంపిణీ వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.