స్పెషల్ డీఎస్సీ ప్రకటించాలని మోదకొండమ్మకు పూజలు

స్పెషల్ డీఎస్సీ ప్రకటించాలని మోదకొండమ్మకు పూజలు

అల్లూరి: స్పెషల్ డీఎస్సీ ప్రకటించాలని ఆదివారం పలువురు ఆదివాసీలు హుకుంపేటలో మోదకొండమ్మ తల్లికి మొక్కులు మొక్కుకున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చేలా సీఎం చంద్రబాబును కరుణించాలని కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. స్పెషల్ డీఎస్సీ ప్రకటించగానే మొక్కులు చెల్లించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఎస్.కొండలరావు, ఉపాధ్యాయుడు రాజారావు తదితరులు పాల్గొన్నారు.