ఆ ఊర్లో అంతా ఉద్యోగులే!
AP: పల్నాడు(D) బొల్లాపల్లి(M) రెడ్డిపాలెంలో సుమారు 250 కుటుంబాలుంటే.. ప్రతి ఇంటా ఉద్యోగి ఉన్నాడు. పేరులో రెడ్డి ఉన్నా ఆ ఊరిలో వందశాతం SC, STలే ఉంటారు. 1912లో రోమన్ క్యాథలిక్ చర్చితో పాటు పాఠశాల నెలకొల్పగా.. అది విద్యాభివృద్ధికి ఎంతో దోహదపడింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ విరమణ పొందిన వారితో కలుపుకుంటే ప్రతి ఇంటా ఉద్యోగులు ఉన్నారు.