రాయితీపై వేరుశనగ విత్తనాలు పంపిణీ
ASR: ప్రభుత్వం 90 శాతం రాయితీపై వేరుశనగ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని చింతపల్లి వ్యవసాయ సహాయ సంచాలకులు బీవీ తిరుమలరావు రైతులకు సూచించారు. మంగళవారం చింతపల్లి మండలంలోని తాజంగి రైతు సేవా కేంద్రం వద్ద ఏవో మధుసూధనరావు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పలువురు గిరిజన రైతులకు వేరుశనగ విత్తనాలు పంపిణీ చేశారు. రబీ సీజన్లో పొలాలు ఖాళీ లేకుండా సాగు చేయాలన్నారు.