మహాదేవప్ప మృతిపై కేంద్ర మంత్రి సంతాపం
NRPT: మక్తల్ మున్సిపల్ కేంద్రంలో బీజేపీ కార్యకర్త మహాదేవప్ప మృతిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలకు ఎవరూ భయపడకూడదని, బెదిరింపుల ముందు అధైర్యపడకూడదని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి స్థానిక నేతలు అండగా నిలబడాలని, అవసరమైతే పార్టీ అన్ని విధాలుగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు.