'ఆటోమేటిక్ టెస్టింగ్ యంత్రాలు ఏర్పాటు చేయాలి'
VZM: జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి బుధవారం తన ఛాంబర్‌లో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (NCAP) జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పట్టణ రహదారులను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశించారు. వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఆటోమేటిక్ టెస్టింగ్ యంత్రాలు ఏర్పాటు చేయాలని రవాణా శాఖకు సూచించారు.