ఆర్టీసీ బస్ బోల్తా.. తప్పిన పెనుప్రమాదం

ఆర్టీసీ బస్ బోల్తా.. తప్పిన పెనుప్రమాదం

VZM: గుర్ల విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఇవాళ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. చీపురుపల్లి నుంచి విజయనగరం వస్తున్న బస్ గిరిడ వైపు వెళ్తున్న కారును ఢీ కొట్టిన నేపథ్యంలో అదుపు తప్పి బోల్తా పడింది. బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో బస్సులో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఘటన జరిగిన సమయంలో బస్సులో సుమారు 30 మంది ఉన్నారు. కారు డ్రైవ్ చేస్తున్న గిరిడ సర్పంచ్ సూరిబాబుకి గాయాలయ్యాయి.