'పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించండి'
GNTR: పెదకాకాని మండలం ఉప్పలపాడులో పంచాయతీ కార్మికుల సమస్యలపై సీఐటీయూ జిల్లా కార్యదర్శి నన్నపనేని శివాజీ ఆందోళన వ్యక్తం చేశారు. కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాలు, యూనిఫాంలు, గుర్తింపు కార్డులు వెంటనే అందజేయాలని గురువారం డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం సమర్పించారు.