బ్రాహ్మణపల్లిలో 'బడి బాట' కార్యక్రమం
MDK: తూప్రాన్ పట్టణ పరిధి బ్రాహ్మణపల్లి హై స్కూల్ హెచ్ఎం నాగలత ఆధ్వర్యంలో ఇవాళ బడి బాట ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన అందించడం, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, నోట్ బుక్స్ అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పరమేశ్వరచారి, మహేందర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, శ్రీనివాస్, సంధ్య, కళ్యాణి పాల్గొన్నారు.