రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి
KKD: తుని రైల్వే స్టేషన్ పరిధిలో రైలు ఢీకొని సుమారు 30 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం ఒకటో నంబర్ ప్లాట్ఫామ్ శివారులో ట్రాక్ దాటుతుండగా ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన బాధితుడిని 108 వాహనంలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు