అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
తిరుపతి: నాగలాపురం మండలం టీపీ కోట నుంచి ఆటోలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ఆదివారం రాత్రి గస్తీలో ఉన్న పోలీసులు పట్టుకున్నారు. కేవీబీపురం మండలం కొండల్లో అదరం గ్రామానికి చెందిన రాఘవయ్య కుమారుడైన డ్రైవర్ వెంకటేశ్ (35)ను అదుపులోకి తీసుకున్నారు. ఆటోలో 16 బస్తాల(640 కిలోలు) బియ్యం గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.