ప్రతి ఒక్కరికి అండగా కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే
E.G: కూటమి ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. ఆయన నియోజకవర్గంలో పలు ప్రాంతాలను పర్యటించి ప్రజల కష్టాలను తెలుసుకున్నారు. పొగాకు కేంద్రంలో కార్మికులను కలిసి వారితో కాసేపు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.