VIDEO: పట్టపగలే పిఠాపురంలో బైక్ చోరీ

VIDEO: పట్టపగలే పిఠాపురంలో బైక్ చోరీ

KKD: పిఠాపురం కుంతి మాధవస్వామి వీధిలో శుక్రవారం పట్టపగలే ద్విచక్ర వాహనం దొంగిలించబడింది. పనిచేస్తున్న చోటే వాహనం నిలిపిన యజమాని పనిలో ఉండగా.. ఓ ఆగంతకుడు వచ్చి బైక్ తీసుకుని పారిపోయాడు. ఈ ఘటన అర్చక సంఘాల ప్రతినిధి జనార్ధనా చార్యుల ఇంటి సీసీ కెమెరాల్లో రికార్డైంది. దృశ్యాలను ఆధారంగా తీసుకుని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.