CMRF చెక్కులు పంపిణీ చేసిన స్పీకర్

CMRF చెక్కులు పంపిణీ చేసిన స్పీకర్

AKP: స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను శుక్రవారం పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 4 మండలాలకు సంబంధించి 18 చెక్కులను అందజేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటుందని ఈ సందర్భంగా స్పీకర్ తెలిపారు. ఇప్పటివరకు 59 మంది లబ్ధిదారులకు 46 లక్షల రూపాయల వరకు సాయం అందించామని అన్నారు.