మాయ మాటలు చెప్పి బంగారు ఆభరణం చోరీ
KMR: జుక్కల్ మండలం పెద్దగుల్ల తండాకు చెందిన లక్ష్మీబాయితో పాటు ఆమె భర్త జుక్కల్ వెళ్లేందుకు బస్సు కోసం రోడ్డుపై శుక్రవారం సాయంత్రం నిల్చున్నారు. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఓ వ్యక్తి జుక్కల్ వైపు వెళ్తున్నానని చెప్పగా వారు అతని బైక్‌పై ఎక్కారు. మధ్యలో వారిని దించి మాయ మాటలు చెప్పి మహిళా మెడలో ఉన్న బంగారు ఆభరణాన్ని ఎత్తుకెళ్లాడని బాధితులు తెలిపారు.