'స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలి'

MNCL: విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని TSUF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. శుక్రవారం జన్నారం పట్టణంలోని కవ్వాల్ చౌరస్తా ప్రధాన రహదారిపై విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ఆంక్షలు పెట్టి స్కాలర్‌షిప్‌లను ఇవ్వకుండా తప్పించుకోవడానికి చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.